ఆకాశం సాంతం

అంతర భారతీయ పుస్తకమాల

ఆకాశం సాంతం

రచన

రాజేంద్ర యాదవ్‌

అనువాదొిలి

నిఖిలేశ్వర్‌

నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా

ISBN 81-237-2565-5

(ప్రథమ ముద్రణ 1999 (శక 1920)

(రె రాజేంద్ర యాదవ్‌. 1951

తెలుగు అనువాదం (€ నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా, 1999 Original title in Hindi : Sara Akash by Rajendra Yadav Telugu Translation : Aakasham Santham

రూ. 65.00

డైరెక్టర్‌, నేషనల్‌ బుక్‌ (ట్రస్ట్‌, ఇండియా, ఎ-5. గ్రీన్‌పార్క్‌,

న్యూఢిల్లీ- 110016 ద్వారా (పచురింపబడినది.

పరిచయం

రాజేంద్ర యాదవ్‌ నవల “సారా ఆకాక్‌ను పాఠకులు ఆదరించారు. సృజనాత్మక జాన్నత్యంతోపాటు జనరంజకత్వాన్ని పొందిన రచనలు తక్కువే వుంటాయి. సృజనాత్మక బెన్నత్యం దృష్ట్యా ఎన్నో నవలలను పేర్కొనవచ్చు. కానీ ఎక్కువ ముద్రణలు పొందినవి తక్కువే! ఆకారంలో చిన్నదైన నవల సినిమాగా రావడం కూడా జనరంజకత్వానికి కొంత కారణం! “నయీకహాసీ” ఉద్యమపరంగా బాగా పేరు తెచ్చుకున్న కథా రచయితలు “భావుకత (రొమాంటిసిజమ్‌)కు వ్యతిరేకంగా నినదించినా, భావుకతాపూర్ణమైన కథలు రచించారు. చాలా చిన్న వయసులో రాజేంద యాదవ్‌ “సారా ఆకాశ్‌” లాంటి ఒక పరిపక్వమైన నవలను రచించడం ఆశ్చర్యమే! సంద ర్భంలో ఒక అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి - “సారా ఆకాక్‌'లోని నాయిక-నా యకులు (ముఖ్యమైన పాత్రలు) కూడ అపరిపక్వ ఆలోచనా స్థాయిలోని భావుకులే! కౌమారావస్థలోని భావుకులైన వ్యక్తులను సహజంగా చిత్రించా లంలే పరిపక్వ మైన రచనా సామర్థ్యం వుండాలి. అయితే అపరిపక్వ వయస్సులోనే రాజేంద్ర యాదవ్‌ సామర్థ్యాన్ని సాధించడం ఆశ్చర్యం బహుశా సంవే దనా త్మీపత వల్ల ఇది సాధ్యమై వుంటుంది. తీవమైన సంవేదన పదును తేరినపుడు రచనా క్రమానికి ఆలోచనల తీవత కూడా సమకూరుతుంది. అంతర్గతంగా సంబంధాలను సక్రమంగా పోషిస్తూ పోగలిగితే, నవలలోని త్మీవత మిగులుతుంది. అందువల్ల పాత్రల సంఖ్య ముఖ్యంకాదు, వాటి పరస్పర సంబంధాలకే ప్రాముఖ్యత వుంటుంది. పాత్రల సమన్వయం, వాటి కోరి కలు, (పవర్తనలతో పాటు అనుకూల-(పతికూల భావాల చిత్రణ జరగాలి. ఇదే పాత్రల సంబంధాల ద్వంద్వాత్మకత. దీని స్వాభావిక చిత్రణ రచనకు ఒక సరైన దిశను కలిగిస్తుంది. “సారా ఆకాక్‌”ను పరిశీలిస్తుంటే అనేక అంశా లవైపు దృష్టి వెడుతుంది. వాటిలో కొన్నింటిని ఇక్కడ చర్చించుకోవచ్చు

సారా ఆకాశ్‌" రచయిత, సవల “ప్రధానంగా నిమ్నమధ్య తరగతి (అక

vi ఆకాశం సాంతం

యువకుడి అస్తిత్వ సంఘర్షణకు సంబంధించిన కథీ అని సక్రమంగానే పేర్కొ న్నాడు. నవల మొదటిసారి 1952లో “పేతొబోల్తే మా” (దయ్యాలు మాట్లా డుతాయి) అనే పేరుతో వెలువడింది. 1960లో “సారా ఆకాక్‌” పేరుతో (ప్రచు రించారు. 1952 నాటి హిందీ నవలల నేపధ్యాన్ని పరిశీలిస్తే, నవలకున్న చారిత్రక (ప్రాధాన్యతను అర్థం చేసుకోగలము. రోజుల్లో - రాజకీయ కథా రచయితగా యక్‌పాల్‌, మనో వైజ్ఞానిక కథా రచయితగా ఇలా చందజోషి, ఆకజ్జేయ్‌ మొ[!గు వారు (ప్రసిద్ధులు. శిఖరా[గం అందుకున్న జైనేంద మార్‌ ఖ్యాతి తగ్గిపోతోంది. భగవతీ చరణ్‌ వర్మ నవల - “చితలేఖ,” పండిత్‌ హజారీ (ప్రసాద్‌ ద్వివేదీ కృతి - “బాణభల్సీ ఆత్మ కథ” మొదలగు చారిత్రక నవలలుగా ఒక కొత్త వరవడిని సృష్టించే దిశలో వున్నాయి. ఇక జైనేంద తర్వాత బాగా పేరు తెచ్చుకున్న ప్రసిద్ధ నవలాకారులు యక్‌పాల్‌, అమృ క్‌లాల్‌ నాగర్‌, భగవతీ చరణ్‌ పర్మ. (పమ ఇతివృత్తంగా ధర్మవీర్‌ భారతి నవల - “గునాహోం కా దేవతా,” రామేశ్వర శుక్లా ఆంచల్‌ రచన - “చడ్‌తీ ధూప్‌” కౌమారావస్థలోని పాఠకులను బాగా ఆకర్షించాయి. నవలల్లో టీనేజ ర్స్‌లోని చౌకరకమైన భావుకత్వం వున్నా నిజమైన డ్రేమ ఎదుర్కొనే జటి లమైన సమస్యల చిత్రణ అసలే లేదు. నేపథ్యంలో పరిశీలించినపుడు “సారా ఆకాశ్‌” నవల మామూలు ఇంట్లోని రోజువారి జీవితంలోని ఇరుకైన పరిస్థితుల్లో వుండే [ప్రేమను చిత్రించింది. కాలంలో అసలు (ప్రేమకు - ఇంటి వ్యవహారాలకు సంబంధమే వుండేది కాదు రచనల్లో!

కానీ “సారా ఆకాక్‌”లోని నవలా శిల్పం, సంవేదన సాధించిన అతి ముఖ్య మైన ఫలితం కుటుంబాన్ని (ప్రేమను జోడించి చూపడం! కుటుంబం కూడా ఎదో ఆదర్శపూరితమైనదేమీ కాదు. ఒక నిమ్న మధ్య తరగతి కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక సమస్యల నిరంతరవలయం. పలయంలోంచి పుట్టిన మంచి - చెడు మనో వికారాలు, కుటుంబ సభ్యుల ఆదర్శాలతో పాటు, నీచత్వాన్ని అందులోని కుటుంబాల నిండు యదార్థాన్ని చ్మితించడం!!

సమస్యాభరితమైన ఇతివృత్తం వున్న నవల ముఖ్యపాత్ర (నాయకుడు) సమర్‌ ఒక మూస నాయకుడేమీ కాదు. పాత్ర రోజుల్లో వచ్చిన హిందీ నపలా సాహిత్యంలో ఒక విభిన్న మైన కొత్త తరహా నాయకుడి పాత్ర! చాలా వరకు పాతను “యాంటీ హీరో” (ANti-hEr0)గా భాపించపచ్చు. పాత్ర స్వభాపరీత్యా ఆనేక వైరుధ్యాల పుల్ల. స్థిమితం లేకుండా; పరస్పర పరుడ్డ

పరిచయం vii మైన (ప్రవర్తసలతో బతికేవాడు. ఒక మంచి నాయకుడికి వుండే గుణాలేవీ లేవు. అభద్రతా భావంతో, నిరుద్యోగిగా అందువల్లనే అస్థిరంగా బలహీనంగా ఊగిసలాడే వాడు. కొత్త రకమైన పాతచిత్రణ, పాత్రలోని అసందిగ్ధత, స్థిరత్వం “సారా ఆకాన్‌ నవలా చట్రంలో పూర్తిగా ఇమిడి వుంది. అందువ ల్లనే ముఖ్యపాత్రతో పాటు ఇతివృత్తానికి సంబంధించిన అస్థిరత్వం నవలలో ఉన్నా సంవేదనతో శిల్పరీత్యా పరస్పరమైన . అనుకూల అంశాలు కళాత్మ కంగా ఒక పూర్ణత్వాన్ని అంతర్లీనం చేసుకోగలిగాయి.

“ఆశలకు - ఆకాంక్షలకు మధ్య, ఆర్థిక - సాంఘిక, సంస్కారపు హద్దు లకు నడుమ జరిగే ఘర్తణ, గెలుపు - వోటమిల అలసట, (ప్రత్యామ్నాయాన్ని వెతికే ఆరాటమే నవల” (మరికొంత - 25 సం!|ల తర్వాత).

“సారా ఆకాక్‌” (ఆకాశం సాంతం) నిండైన ఒక (సేమ కథ. ఆధునిక సాహిత్యంలో [సేమ పేరు మీద వచ్చిన కథా (నవల) - సాహిత్యమంతా సాధారణంగా ఏకపక్షంగా, అసంపూర్ణంగా మిగిలిపోయింది. దాంపత్య (ప్రేమ గురించి రాసిన నవల దాంపత్య 1పేమలేని కథలకంలే ఎంత ఆకర్షణీ యంగా, ఆసక్తి కరంగా - గంభీరంగాను వుంది. కావలసినంత రస పోషణ - పరిపూర్ణతలను వ్యక్తం చేసే రచనాత్మక పరాకాష్ట ఇందులోనే ఇమిడి వుంది. (పేమ అంటే ఏరో ఒక వ్యాపారాన్ని వెలిగించే కాకరవత్తి వెలుగు కాదు. అది ానపీయమైన, సామాజిక బాధ్యతతో కూడిన ఆచరణ. “సారా ఆకాక్‌” చది

ఏతే ఇది అర్థమవుతుంది. అసలు ఒక నవల రచించడమంటే మానవీయతను,

J

సాంఘిక, వైయక్తిక బాధ్యతను అన్వేషించే (ప్రక్రియ. (ప్రక్రియ ఎంత వెయక్తికమెనా, స్తీీ-పురుషుల వ్యవహారమైనా చివరికి అది ఒక కుటుంబ పరమైన, సామాజికమైన ప్రక్రియగా మారక తప్పదు. దాంపత్య (పేమను గేలి చేసేవాళ్లు. ఎదో పాతకాలం నాటి గొడవ అసి భావించేవాళ్లు వాస్త

వంగా దాంపత్య జీవితంలోని ఎగుడు-దిగుడులను, దారిలో వుండే బాధ లను అర్థం చేసుకోలేరు.

నిమ్న మధ్య తరగతి కుటుంబాలలో దాంపత్య (పేమ కఠినమైన అను భవాల ద్వారానే లభిస్తుంది కాని అంత సులువుగా స్వంతంకాదు. జీవితాంతం ఇలా స్వంతం చేసుకోలేని వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు! సంస్కారప రంగా సాం(పప్రదాయానుసారంగా, గుడ్డి నమ్మకాల జడత్వమే దాంపత్య

(పేమ వైఫల్యానికి కారణం. “సారా ఆకాక్‌' రచయిత రాజేంద్ర యాదవ్‌కు

vii ఆకాశం సొంతం

సంస్కారమేమిటో బాగా తెలుసు. విలువైన అంశమేమిటంటే అమానవీయ సంస్కారాలను, సాంప్రదాయాలను, గుడ్డి నమ్మకాలను రాంజేంద్ర యాదవ్‌ త్మీవంగా అసహ్యించుకుంటున్నాడు. అందువల్లే నవలకు తొలుత ఆయన “సేత్‌ బోల్తె హె” (దయ్యాలు మాట్లాడుతాయి) అని పేరు పెట్టి తన అస హ్యాన్ని వ్యక్తం చేసుకున్నారు. యాదవ్‌లో ఇప్పటికీ అసహ్యం కొనసాగు తూనే వుందని ఆయన మిత్రులకు పాఠకులకు బాగా తెలుసు. ఇప్పటికీ “హంస్‌” పత్రికా సంపాదకీయాలలో రాజేంద్ర యాదవ్‌ స్త్రీలు, దళితుల సమస్యలపై ఎంత తీవంగా ఆవేదనతో (ప్రతిస్పందిస్తున్నారో మనకు తెలు సు. ఆవేదనకు మూలం “సారా ఆకాన్‌”లో వుంది. నవల స్త్రీవాద రచన కాడు - కానీ స్త్రీవాదాన్ని తర్కించే రచనగా తీసుకోక తప్పదు.

నవలలోని అసలు (పేమ కథ - పరిస్థితులు ఇందులోని పాత్రలకు పేమించుకునే అవకాశాన్ని ఇవ్వవు, మెగా మకు వ్యతిరేక దిశలోకి నెట్టి (ప్రయత్నం చేస్తాయి. (ప్రేమను పాషాణంలాంటి పరిస్థితుల మధ్య పెట్టడమే నవలలోని శిల్పం సాధించిన చాతుర్యం. (పేమ అనే బీజాంకురంపె కొండలోని రాతి పలకలు వున్నాయి. వాటిని ఛేదించుకుని అది మొలకెత్తాలి. నవలలో చాలా దూరందాకా అసలు (పేమ వ్యవహారమే కనపడదు. ఏమైనా కనపడుతున్నదంటే వ్యతిరేక దిశలోకి తీసుకెళ్ళిపోయే పరిస్థితులు, కొండరాతి పలకలు, సమర్‌ మొండి పట్టుదల, కోపం, చిరాకు, ఆరాటమే! వీటిలోనే (సేముదాగిపోయి మిగిలివుంటుంది, వికసిస్తూపోతుంది. “సారా ఆకాక్‌”లోని పేమ భావం వాస్తవికమైనది. అది అనుకూలమైన పరిస్థితుల కంలే (ప్రతికూల పరిస్థితుల్లోనే సురక్షితంగా వుంటుంది. ఎంతగా అణచిపె డితే అంతగా అది వికసిస్తూ అంతిమంగా వ్య క్రమవుతుంది.

ఒక దిగువ మధ్య తరగతికి చెందిన నిండు కుటుంబంలో బి.ఏ. చదు వుతూ, నిరుద్యోగిగా వున్న సమర్‌ అనే యువకుడికి వివాహం జరిగింది. అతని దాంపత్య (పేమే ఇతివృత్తం నవలకు! సమర్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) సభ్యుడి పురాతన ఆదర్శాలను మొండిగా నమ్మి, బహుశా (బహ్మచారిగా జీవితాంతం గడపాలనే ఒక ఆదర్శ యువ కుడి కథ. అతను దేశం కోసం సర్వస్వం త్యాగం చేయాలనుకుంటాడు. బల వంతంగా అతనికి పభ అనే అమ్మాయితో వివాహం జరిగిపోతుంది. పెద్ద కుటుంబంలో వున్న ఇతర వ్యక్తులు - రిబైర్‌కాగా, నెలసరి ఇరవై ఐదు రూపాయిల

పరిచయం Ix పెస్టన్‌ పొందుతున్న తండి ఇంకా తల్లి, క్షర్కుగా పనిచేస్తున్న అన్న, వదిన, వాళ్ల పిల్లలు, భర్త పీడితురాలైన చెల్లెలు మున్నీ! “సారా ఆకాశ్‌” నవలలో మున్నీ (భర్తచేత హింసించబడిన యువతి) పాత కథకు ఒక గాఢమైన అంతరార్థాన్ని కలిగించింది. నిమ్న మధ్య తరగతి హిందూ కుటుంబంలో వుండే పుచ్చిపోయిన డాంబికాలు, మర్యాదల భేషజాలను అనేక పారా లలో బహిర్గతపరుస్తూ నవల కుటుంబంలోని వ్యక్తుల దయనీయతను, మూర వివశత్వాన్ని చిత్రించింది. ఇలాంటి కుటుంబంలో వుంటూ ఆజన్మ (బ్రహ్మచారిగా వుంటానని శపథం చేసిన సమర్‌కు ప్రభతో వివాహం జరిగిపోయింది. కొత్తగా పెళ్లి చేసుకున్న-కౌమారావస్థలోని భార్యభర్తలు, సహజం గానే పరస్పరం (పేమించుకోవడం, సమర్పించుకోడం న్యాయం. కానీ (పేమ వాళ్ళకు లభించదు. అలా ఎందుకో (పేమ వంచితులవుతారు వాళ్ళు? కారణాలను అన్వేషిస్తూ చిత్రించే [కమం “సారా ఆకాక్‌'లో వుంది కాబట్టి అంతగా జనరంజకం కాగలిగింది. సమర్‌ అసలు వివాహం చేసుకోకుండా, చదువు కొనసాగించాలను కుంటాడు. (బహ్మచారిగానే జీవితాన్ని గడపాలని కోరిక -“ఈ కుర్రాడికి రోజు శోభనం అనే విషయం (పపంచానికంతా తెలిసిపోయింది. “దేశానికి సాహసవంతులు, కర్మవీరులైన యువకుల అవసరం వుందని" నినాదం ఇచ్చిన యువకుడే మంచంగా మారిపోయాడు. గాలి వానకూడా అడ్డు పెట్టలేక పోయిన సమర్‌ గత రెండు వారాల నుంచి “శాఖికు హాజరు కాలేదంటే ఎవరైనా నమ్ముతారా?” సమర్‌ వివాహం ఒక ఆటంకమని భావిస్తాడు. అతను హనుమంతుడు, భీష్మ పితామహా మార్గంలో పయనించాలనుకుంటాడు. ద్వైదీ భావ మానసిక స్థితిలోనే ఆతను శోభనం రాత్రి తన సంకల్పం ఎమిటో తిరిగి చెప్పుకుంటాడు. “అవును, ఆటంకాలను - కష్టాలను తొక్కుతు వెళ్ళిపో తాను. ఆజన్మ (బహ్మచారిగా వుండాలనే ప్రతిజ్ఞను నేను రోజున కూడా దృఢంగా పాటిస్తాను.” దిగువ మధ్య తరగతితో పాటు అసలు మధ్య తరగతికి చెందిన హిందూ యువకులు తెలివిరాగానే బ్రహ్మ చర్య సంకల్పాన్ని పొందే ఆనవాయితి రోజుల్లో వుండేది. బహ్మచర్యమనే ఉపదపం చాలా కాలం దాకా కొంత ఆతి వ్యాప్తిలోనే వుండేది. గాంధీగారు కూడా ఆరుసార్లు బ్రహ్మచర్య సంకల్పాన్ని

భగ్నం చేసుకున్నారని కస్తూర్‌బానే చెప్పింది. సవల అలాంటి ఒక (బ్రహ్మ

X ఆకాశం సాంతం

చారి శోభనం ర్యాత్రితో మొదలపుతుంది. వయసు డైస (బహ్మచారి రాత్రంతా కనతో పోరాడుతాడు - దినమంతా ఇతరులతో...!

కుర్ర చేష్టతో కూడిన ద్వైదీభావాన్ని రాజేం[ద యాదవ్‌ సహజంగా చిత్రించాడు. సమర్‌ మొండితనంలోని మనస్సుకు వున్న బలహీనతలు మధ్య మధ్యలో తళుక్కున మెరుస్తాయి. బలహీనత సమర్‌ పక్షాన ఉపయోగప డేదే! ఇదే అతని సహజమైన వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తుంది. అతని అతివా దాన్ని అంగవైకల్యంలాంటి వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుతూ వుంటుంది. అతని కురతనపు మొండి వ్యవహారాన్ని, ప్రభ సమక్షంలో కలిగే వొత్తిడిని, రాజేంద్ర యాదవ్‌ నవలలో నాటకీయ స్యగతం, సంభాషణ (సంవాదం)ల శైలీ

పంలో ఎంతో సిద్ధహస్థుడిగా తీర్చిదిద్దాడు. ఒక విధంగా తీవ ద్వంద్వాత్మ కతను వ్యక్తం చేసే స్వగతం, రెండు పాతల మధ్య సాగే సామాన్య మైన సంవాధానికంటే తరచుగా ఎక్కువ (ప్రభావాన్ని కలిగిస్తుంది.

“సారా ఆకాక్‌'లోని స్వగతం ఏకాలాపం కాదు, ఒకే వ్యక్తిలోని రెండు మానసిక స్థితుల- సంవాదం. అందులోని ప్రత్యేకత, ఒక బలం ఏమి టంలే - కుటుంబపరమైన, సామాజికమైన, ఆర్థిక పరిస్థితులు అల్లుకునిపో డం...! ఒక మనస్సు దృఢంగా ఇలా అంటుంది - “నేను రోజు కూడా దృఢంగానే వున్నాను. జన్మ |బహ్మచారిగా వుండాలనే ప్రతిజ్ఞను తప్ప లేదు.” రెండో మనస్సు అంటుంది - “ఏమిటండీ, భార్య ఎప్పటికీ ఆటం కంగా పుంటుందా? రాముడి శక్తిని సీత నుంచి ఏడదీయగలమా? రాజస్థాన్‌ లోని క్షాతాణులు స్వయంగానే తమ భర్తలను యుద్ధ రంగానికి పంపించ లేదా? అయితే ఇది ఆర్‌.ఎస్‌.ఎస్‌. సభ్యుడైన కిషోరాపస్థలోని ని యువకుడు డ్ర్యదీభావం. భమ వశాత్తు ఎదో అదంతా ఒక బలాహీనతగా భావించే సహ జమైన మానసిక (ప్రవృత్తి కాదు. అదే ఒక విధంగా జీవితాన్ని సార్థకం చేసే రాగాత్మక సారాంశం. సారాంశమే మౌనంగా వుంటూ, కథా ఇతివృత్తాన్ని సమర్‌ చేతనమై వ్యాపించిన అంశాన్ని జోడిస్తూ సడిపించింది. చివరికి

రైన స్థానానికే చేరవేసింది.

“ప్రభ ఆకుపచ్చ గాజుల చేయి” అనే పర్దన మొట్టమొదట కథలో అసలు ఎలాంటి ప్రాముఖ్యత లేని విధంగా (ప్రవేశిస్తుంది. ఉపేక్షించగలిగే

ళ్‌

భ్‌

వ్‌ ex పతకలా అనిపిస్తుంది. సరిగ్గా పాణ్ళిగహణం నాటి (ప పతీక - పివాహ మండపం

లో పారిపోవాలనుకునే సమర్‌కు, జ్ఞాపకమే వెంటాడుతూ పోవడం.

పరిచయం xi బంధించి వేయాలనే (పయత్నాలనుంచి రక్షించు కోవాలనే ఉపాయం, - “నా కాళ్ళకు రాళ్లు కట్టి వేయవద్దు - తన పిడికిలిలో పిండివేయబడుతున్న ఆకుపచ్చ గాజుల చెయ్యి - పిండి ముద్దను అదే చేతిలో పట్టు కొని, మాట్లాడకుండా కూచున్న అతనిలోంచి అప్పుడప్పుడు వస్తున్న రెండు చప్పుళ్ళను వింటున్నాడు... ఇప్పటికీ సమయం వుంది, లే... పారిపో?” కుటుంబమంలే ఎమిటి? ఒక్‌ కారాగారం. అందులో చిక్కుకున్న వాళ్లు నేరస్థుల్లా జీవితాన్ని గడుపుతున్నారు. అది వాళ్ళ నేరం కాదు. వర్గంలో పుట్టడమే వాళ్లు చేసిన నేరం. గుడ్డి నమ్మకాలు, పనికిరాని ఆచారాలు, డాంబికాలు వాళ్ళను మరింతగా బిగిస్తాయి. కారాగారంలో సుంచి వచ్చేసే మార్గమేది లేదు. వాళ్ళంతా నిరపరాధులే. నిమ్న మధ్య తరగతి పరిస్థితులే వాళ్ళ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కబళించివేసాయి. వాళ్ళందరూ పర సరం చిదరించు కుంటారు. కొట్లాడుతారు, తిట్టుకుంటారు. అప్పుడప్పుడు అపరాధ భావానికి బలెపోతారు. సాంప్రదాయాల గుడ్డి ఆచారాలసు మోస్తూ పుంటారు. వాటిని విదిలించుకొని పారేసి బరువును దించుకోవాలనుకోరు!

క్‌ > కుటుంబంలోనే సమర్‌ చెల్లెలు మున్నీ ఒక వివాజాతగా.

జాంసంచెవాడు. ఆంచుపల్ల ఆమె తల్లిగారింప్లాన వుండిపోయింది. కొంత a> చా 5. —_ కాలానిక భర వచ్చ ముబ్నిని రమ్మంటాడు కానీ మున వెళ్ళనంటుందడి

డికి అప్పుగించె దృశ్యం అంతకంటే దయనీయమైనదేమిటం టే, ఆవుకు తన

త్త ర్త కీడించడని, (శేముగా చూసుకొని, భదత కలిగిసాడని మున్నా తల్లతండ్రు

జాల = = జ్‌ రాం లాశిస్తారు. కానీ కసాయివాడి నుంచి అలాంటి దయను ఆపును అమ్మేవాడెవడూ వానో ఆశీంచడు శవ aa ౯, జ్‌ ఇకుడ మరొ వెరుధ్యా న్న అరం చేసుకోవాలి. ముసి తలిగారిలు ఆమె J ౬ు 5 Ce హ్‌ ~ వాన్‌ a జ్‌ భర్త నిచత్వల వల్ల ఎంతగానా దుఃక్రీస్తూ వుంది. అద [పభకు అత్తవారి ఇల్లు

xii ఆకాశం సాంతం

తమ కూతురుపై జరుగుతున్న దౌర్జన్యాన్ని భరించే కుటుంబమే, మరొకరి కూతురైన (ప్రభపట్ల దౌర్జన్యంగా (ప్రవర్తిస్తుంది. క్రూరుడికి బలైపోయేవాడు దౌర్జన్యాన్ని" అసహ్యించుకోడు. పైగా తానే స్వయంగా క్రూరుడిగా మారిపో తాడు. ఇది కూడా ఒక ఆనవాయితి.

“సారా ఆకాక్‌'లోని ప్రధానమైన రచనాత్మక శక్తి నిమ్న మధ్య తరగతి కుటుంబం చుట్టూ అల్లిన చిత్రణ. తండ్రి ఎంత కోపిష్టిగా కనపడతాడో అంతే బాధను అనుభవిస్తూ వుంటాడు. ఆయన సాంప్రదాయం (పరంపర) ఆచార మనే పేరుమీద తన పిల్లలకు అపకారమే చేస్తాడు. కానీ ఆయనే కుటుం బంలో మరీ నిస్సహాయుడు, అందరికంటే బాధాతప్పుడు. సమర్‌ను తాను కొట్టి నపుడు ఆయన ఎంత అసహాయుడో వ్య క్రమవుతుంది. సమర్‌ అన్న జీవితం నీరసంగా, యాంత్రికంగా సాగిపోయేది. దానికి ప్రతీక ఆయన పాత సెకిలు. సమర్‌ తల్లి అత్తగా, ఒకనాటి కోడలుగా తన పరిధిని దాటి రాలేదు. ఇక నవలలో కాస్త ఆసక్తిని కలిగించే పాత్ర సమర్‌ వదిన. ఆర్థికంగా ఎన్నో ఇబ్బం దుల్లో సాగే కుటుంబంలో ఆమె చిన్న చిన్న మోసాలు, కుట్రలు పన్ని, తగాదాలు పెట్టి తమాషా చూస్తూ వుంటుంది. ఇందులో అందరూ అసహా యులే - వదిన మరీ దయనీయమైన వ్యక్తి - ఎవరూ చెడ్డవారు కాదు. విషాధగాధలో ఎవ్వరూ విలన్‌లు కాదు. వ్యవస్థ - పనికిరాని ఆచారాలు మాత్రమే విలన్‌లు. వరకట్న సమస్య, నిరుద్యోగం, సెక్స్‌ పరమైస భయా లు, స్త్రీలను పీడించడం - ఒకే వ్యక్తి అబ్బాయి తండ్రిగా పరపీడకుడిగా కనపడితే, అతనే అమ్మాయి తండ్రిగా పీడితుడు. పీడించేవాడు - పీడితుడు ఒకే యాతనకు లోనవుతూ ఆత్మముగ్గులు కావడం ఇందులో ([పత్యేకత! శాశ్వతమనుకుంటున్న సనాతన ఆచార ప్యవహారాల పట్ల వాళ్ళకు నమ్మకం - ఇదే క్రమంగా వాళ్ళను పతనంవైపు నెట్టడం తప్ప ఉద్ధరించుకునే అవ కాశం కనపడదు. (పభ, సమీర్‌ చీకటి గుయ్యారంలోంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఒక విధంగా వాళ్ల మొండితనం కూడా వ్యవస్థ ఇచ్చి నదే! (పతికూల పరిస్థితులను అధిగమించే దాంపత్య సంవేదనకు అపార మైన విశ్వాసాన్ని కలిగించే లక్షణం - నవలలో వుంది. అదే రాజేంద యాదవ్‌ (ప్రతిభ. పరిస్థితులు ఎంత ఘోరంగా వున్నా మానవీయ సంబం ధాలు వాటితో పోరాడే సవాలును స్యీకరించగలవు!

దాంపత్య సంబంధాలను గుర్తించి, చిత్రించే నవలా ప్రక్రియలో

పరిచయం xii ఎలాంటి తొందరపాటు లేదు. రచనలోని నడకలో సహజత్వం వుంది. కావాలని ఆదర్శవాదాన్నో లేదా సంస్కరణవాదాన్నో చొప్పించే ప్రయత్నం ఎక్కడా లేదు.

“ఆకాశం సాంతం” (సారా ఆకాన్‌) మొదలి అధ్యాయంలోని చివరి అంశం ఎంతో హృదయస్పర్షిగా సాగింది. హృదయాన్ని కదిలించే ఘట్టాన్ని ఎంతో క్లిష్టంగా రూపొందించడం జరిగింది. అంతకు పూర్వమే వున్న పరిస్థితుల ఘర్షణ వల్లనే ఏధమైన ఆర్ధ్రత రాగలిగింది. మానసికమైన, బాహ్యమైన అనేక బాధలను - పరిస్థితులను అధిగమించి సన్నివేశానికి చేరుకొంది. అందువల్లే అది విశ్వసనీయమైనది - ఆర్థ్రమైనది. (పభపట్ల సమర్‌ మొండి (ప్రవర్తన ఒక రకమైన క్కురచేష్ట! గత చరిత్ర పట్ల (పేమ, మహో పురుషుల పట అతి (శద్ధాభక్తులు అతని అపరిపక్వమైన ఆదర్శవాదానికి గుర్తు! కౌమా

గా

రావస్థలోని భావకత్వంతో ఏదో చేయాలని ఒక ఆదుర్దా - ఆవేశం వాస్తవ పరి తులు ఎదురు దెబ్బలు తింటూ హాస్యాస్పదమైన దయనీయ స్థితికి వస్తుం సమర్‌ - (ప్రభల పరస్పర ఆకర్షణాభావం ప్రచ్చన్న రూపంలో వుంది. ఆడి బహుగా సాంప్రదాయబద్ధమైన మర్యాద. భార్యాభర్తల పరస్పర సమ ర్పిత భావంపై ఆధారపడి వుండొచ్చు. ఎంతో మొండితనం, పురుష [కూరత్వం వున్నా (పభ తనదేననే భావం సమర్‌లో వుండి. శీలానికి సంబంధించిన ఎలాంటి దోషం సమర్‌లో లేకపోవడం కూడా చాలా ముఖ్య మైన అంశం.

అందువల్లనే “సారా ఆకాశ్‌”లో, సమర్‌-ప్రభల సంబంధాల పర్యవసనానికి

గ్‌ ల్లి

తొలుతనే బీజాలు వున్నాయి. విధంగా సవల హేతుబద్ధంగా ఒక స్వయం ప్రతిపత్తితో - అంతర్‌ నిర్మాణంతో సాగింది. బాహ్య కారణాలకై రచనా వికాసం ఆధారపడిలేదు. సమర్‌-(పభలకు తమ అహంకారం - మొండి తనం పల్లనే పరస్పరం నిర్లక్ష్యం చేసుకుంటున్నామనే తెలుసు. నిర్లక్ష్యం లేదా ఉపేక్షాభావం, మొండి తనంలోనే ఆత్మీయత ఇమిడి వుంది. సమర్‌ను (ప్రభ మెచ్చుకోవడం, తాను తప్పు చేసాననే గ్రహింపు సమర్‌లో వుండడం - నవలలోని ఇతివృత్తంలో ఒక అతి ముఖ్యమైన గమ్యం, మూర్థత్వాన్ని గ్రహించడమంటే సమర్‌ మాటల్లోనే - “అసలు నా ప్రపర్తనంతా పొరబాటే కాదు మూర్జత్వమే?” సమర్‌ -[పభల వివాహం మధ్యపర్తుల ద్యారాచే కుదిరింది. ఇలాంటీ హాల్లో అపరిచితులైన ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలుగా కలవగానే, వారి

లా

XIV ఆకాశం సాంతం

ద్దరి వ్యక్తిత్వాల మేకులు గుచ్చుకోవడం (ప్రారంభిస్తాయి. నిరాలా (ప ఖ్యాత హిందీకవి) తన రచన “కుల్లీ భాట్లొలో తన శోభనం నాటి రాత్రిని ఎంతో మనోరంజకంగా వర్ణించారు. దాదాపు సమర్‌-పభల కలయిక కూడా అలాం టిదే! అబ్బాయి పెళ్ళికూతురును స్యీకరించాలకుంటూనే తన అహంకారాన్ని నిలుపుకోవాలని చూస్తాడు. అమ్మాయి పెళ్ళి కొడుకుకు సమర్పించుకోవాల సుకుంటుంది కానీ అందులో ఆమె ఆత్మ గౌరవాన్ని - వ్యక్తిత్వాన్ని అబ్బాయి గమనించాలి. పెళ్ళి కొడుకు తనను బుజ్జగించి, తియ్యతియ్యని మాటలు చెప్పాలి. కానీ ఇదంతా మొండి పట్టుదల - నటన - అహంకారాలతో సాధ్య మయ్యేది కాదు. ప్రభ సమర్చించుకోవాలనుకున్న సమర్‌ ఎదుట మోకరిల్లి కాదు. తనను తాను సమర్‌ మె రుద్దాలనుకోదు. సమర్‌ చదువు కోవాలను కుంటే తాను అతని దారిలో ఆటంకం కాదలుచుకోలేదు, (పభ వ్యక్తిత్వాన్ని సమర్‌, అహంకారంగా అర్థం చేసుకుంటాడు. అతను స్త్రీ సహజమైన ఆత్మ గౌరవాన్ని పట్టించుకోడు. ఆత్మగౌరవం అనేది కోరి కున్నా, ఒక న్మిగహం లాంటిది. ఇక సమర్‌లోని మొండిపట్టుదల (అహ అవాస్తవమైనది. ప్రభ పట్ల పున్న ఆత్మీయతయే అతని టు. విధంగా అవాస్తవిక - వాస్తవికతల మధ్య వున్న ద్యంద్యమే (వెరు ధ్యమే) “సారా ఆకాక్‌” కథ ఇతివృత్తం అని చెప్పాలి. రకమైన ద్వంద్వమే నవలలో సమయోచితంగా చోటుచేసుకున్నది. అవాస్తవికత, యధా రంలోకి పరిణమించే క్రమంలోనే నిమ్న మధ్య తరగతికి సంబంధించిన స్పితిగతులను అల్లడం జరిగింది. ఒక (మేమ స్థితులను విధంగా సహజంగా అల్లవ పతంత్య అనంతర కథా సాహిత్యానికి నిదర్శ

“సారా ఆకాక్‌'లోని మరో (పత్యేకతను పేర్కొనడం కూడా అవసరం.

ర్‌ విల

గాథలో జీవితంలోని విషము పరి CJ సి సా

ఆక వై

అవగాహన చేసుకునే [క్రమాన్ని ఇంత శక్తి వంతంగా చిత్రించే నవలల సంఖ్య చాలా తక్కువే! అహంకరించడం, తన గొప్పదనాన్ని చాటుకోవడం, నిర్లక్ష్యం చేయడం, ఆత్మ క్షోభ మొదలగునవి అన్నీ సమర్‌ మాటల్లోనే చెవె ప్పాలంటే “ము మూర్జత్వం” మాత్రమే! అదే [క్రమక్రమంగా అర్ధం చేసుకోవడంలో ప్రస్ఫు టితమవుకుంద్‌. అవగాహన కుదరగానే నవదంపతుల ఆత్మీయత, అనో వస్యత సక

ణలిక పరిణమిస్తుంది.

-విశ్వనాథ్‌ త్రిపాఠి

పూర్వార్తం : సాయంకాలం

ఉత్తరంలేని పది దిక్కులు

ఒకటి

తాళ-లయలేవీ లేకుండా 'ఢమాఢమ్‌' వాయిస్తున్న ఢోలక్‌, పాడుతున్న ఆడ వాళ్లేకీచు గొంతులు హఠాత్తుగా ఆగిపోయాయి. ఏమైందీ? ఏమైందీ? అంటూ ఆడ వాళ్లు-పిల్లలందరూ వీధుల్లోంచి ఇళ్ల కిటికీల దగ్గర - ముందు' భాగాల్లో గుమికూడారు. కింద గేటు దగ్గర నడుం ఊపుతూ, చప్పట్లు చరుస్తున్న కొజ్జాలు “అయే...జియో...జియోరే లాలా” అనే ఆలాపన మానేసి, నోళ్ళు తెరచి తలల్ని నిక్కించి పెకి చూస్తున్నారు.

వీధి చివర, సరిగ్గా మా ఇంటికెదురుగా వున్న సామ్వల్‌ కోడలు కిరస నాయిలు చల్లుకొని, నిప్పంటించుకొని తన గదిలో చచ్చిపోయింది... పాగ సుళ్ళు తిరుగుతుంలే జనం రక్షించాలని పరిగెత్తారు కానీ మూసి వున్న కిటి కీలను విరగ్గాట్టేలోగా, ఆమె (ప్రాణాలు గాలిలో కలసి పోయాయి. అయ్యో! ఇలాంటి శుభ ఘడియలో ఇదంతా జరగాలా? ఏదో అరిష్టం జరుగుతుందనే అనుమానంతో అందరి గుండెలు కొట్టుకోసాగాయి. కేకలు - అరుపులు, అటు ఇటూ పరిగెత్తుతున్న చప్పుడు వింటూవుంటే భూకంపం వచ్చినట్టు అనిపించింది.

సన్ను నేను లక్షసార్లు నమ్మించుకోవాలని ప్రయత్నించాను; అయినా రోజే నా శోభనం రాత్రి అని నమ్మలేకపోతున్నాను.

కుళ్లిన చెత్తాచెదారంతో మురికి - ఇరుకైన సందులో ఆడవాళ్ల ఎడు లు-పెడ బొబ్బలు చాలా సేపు నా వెనకాలే వినపడుతూ వుండిపోయాయి. గందర గోళం లోంచి తప్పించుకొని పారిపోయొచ్చాను. నా వెనకాల వినపడుతున్న స్యరాలు అసలు అనందంతో పాడుతున్న పెళ్ళిపాటలా లేదా ఎవరో కాలి చచ్చిన వాళ్ల గురించి ఏడ్పులా అనే తేడాను గమనించే స్థితిలో నేను లేను... బహుశా తేడాను గమనించే తీరిక కూడా లేదు నాకు...

రోజే నా శోభనం రాత్రి అని లోకమంతా తెలుసుకొంది. “దేశానికి సాహసవంతులైన, కర్మ వీరులైన యువకులు కావాలి” - అని నినాదం ఇచ్చే యువకుడు కూడా ఇప్పుడు నాలుగు కాళ్ల జంతువెపోయాడు.

పచ గాలి - వానలో కూడా ఆగనివాడు. సమర్‌ రెండు వారాల

4 ఆకాశం సాంతం

నుంచి శాఖకు వెళ్లకుండా, తన స్నేహితుల కళ్లు కప్పి తప్పించుక తిరు గుతున్నాడంటే, ఎవరైనా నమ్ముతారా? వేళ అతిధుల్ని, మిత్రుల్ని, పరిచితులు, అపరిచితుల్ని - అందరినీ, వేలత్తి చూపుతున్న కళ్లని తప్పించుకుంటూ - తప్పు కుంటూ చిన్నచిన్న సందుల గుండా దేవాలయానికి వెడుతున్నా డంటే నమ్ముతారా? కొన్ని క్షణాలైనా (ప్రశాంతంగా కూచుని, జరిగిన ఇంత పెద్ద మార్పు గురించి ఆలోచించే చోటు ఇదేగా, తర్వాత ఆలస్యంగా రాత్రికే ఇంటికే వెడతాడు. అప్పటికి ఏడ్పులు - అరుపులన్నీ సద్దదుమణు గుతాయి. అయినా మాటలు వెంటాడుతూనే వున్నాయి.

అరే తీసుకొండి... తీసుకొండి... మరొకటి తాగండి ఠాకూర్‌ సాబ్‌! మీ రెండో కొడుకు పెళ్లి - మీరేమో ఇంత బద్దకంగా వున్నారేమిటి? కాని మిత్ర మా, మీ వియ్యంకుడు మాత్రం అదోలా ... అయితే ఠాకూర్‌ సాబ్‌, మీ ఇళ్లల్లో జరిగే పెల్లికి దేశీ సరుకేనా తాగించేది? దినమైనా ఫారిన్‌...”

భగ్గున మండుతున్న ముఖం ... మెతకబడిన కళ్లు ... ఆవిరి నిండిన సారాయి శ్వాస ... కింద కూచున్న స్ట తలపాగ సర్దుకుంటూ గర్జిస్తు న్నారు, “మాకు మోసం జరిగింది...

“లేవండీ ... లేవండీ ... సప్తప పది జరగబోతోంది. పడుకోవాలని వుంటే వెళ్ళి విడిది ఇంట్లో పడుకొండి ... ఇక్కడే పడి వున్నారేమిటి? శరీరంపై స్పృహ లేదు, దుస్తులమై ధ్యాస లేదు... ఏమనుకుంటారు ఇలాంటి పెల్లి వాళ్లను తీసుకొచ్చారని ... లేవండి ... లేవండి...”

“చూడు ... చూడు... దాన్ని చూసావా, అమ్మాయి తల్లి వెనకాలే వుంది చూడు ... పెద్ద కొప్పు కట్టింది... చెవులకు తెల్లటి పూవులాటి రాళ్లు. మిత్రమా - ఏమి కళ్లు అవి - నా శవాన్ని ఇక్కడి నుంచి మోయాల్సిందే!”

“హాం చెప్పు, బావి ధర్మ సత్రం ఏది కట్టించినా నీ సలహా (పకారమే కట్టిస్తానను - తర్వాత అమ్మాయి (ప్రమాణం చేస్తూ...”

“తూ - తూ - తూ... శహనాయి. 'కిడింగ్‌ - కిడింగ్‌ నగాడా. మేలతాళా లతో మారుమోగింది.

పారిపో - పారిపో... జంజాటం నుంచి దూరంగా పారిపో - నా పల నుంచి ఎవరో ఒకటే గోల. అక్కడెవరో తెలిసిన కుర్రాడిలా పున్నాడు, ముఖం చాలేసుకుని పారిపో - కనపడితే రెండు గంటలదాకా వదలడు.

శ్‌

గవ జోక్‌, వేసాడు. “పె పెళ్ళాం ఎలా వుంది?” మిఠాయి తినిపించు... “పెళ్ళికి

ఆకాశం సాంతం 5

తీసుకెళ్ళ లేదేమిటి?'... పారిపో!

ఏమిటిలా మొదలైంది భారంగా జీవితం! అన్నీ వదిలేసి దూరంగా తెలి యని చోటికి పారిపోవాలనిపిస్తున్నది. మరుసటి రోజు పత్రికలో (పకటన వెలువడుతుంది - కొడుకా, మీ అమ్మ ఆరోగ్యం బాగుండలేదు. నీ పట్ల ఎలాంటి ఫిర్యాదు లేదు." చుట్టుపక్కల ఎక్కడా సందడి లేదు. ఏదో భారీ (టక్‌ వచ్చి మెత్తని ఇసుక వున్న చోట దిగబడిపోయినట్టు అనిపిస్తున్నది. - ఇంజన్‌ ధూధూ అని చప్పుడు చేస్తున్నా చక్రాలు గర్‌ గర్‌ మంటూ అక్కడే తిరుగుతున్నా (టక్‌ మాత్రం అక్కడే నిలుచుంది. కొండల్లాంటి కొంగలు ఆకా శమంతా పరుచుకున్నాయి. ఏమీ కనపడదు, దిక్కులన్నీ తప్పిపోయాయి. శక్తి ఉడిగిపోయింది. ఊపిరి ఆడని స్థితి గుండె గాబరా గాబరాగా - వాతావ రణం నిండా వ్యాపించిన దుమ్ము - ధూళి - కదలని దుమ్ము...!

గోధూళి వేళ గడచిపోగానే సలువైపులా పొగమంచు వ్యాపించి పోయిం ది. దేవాలయ స్తంభానికి తల అనించి కూచున్నాను - తలంతా ఎంతో భారంగా! పాలరాతి తెలుపు నలుపు ముక్కలతో చదరంగం ఆవరణ నిండా, మూల పగహానికి ఎదురుగా వున్న ముఖ ద్యారందాకా సలుచున్న స్తంభాలు - వాటికై ఆనిన విశాలమైన బరువైన హాలు - నట్ట నడుమ వగహానికి ఎదు రుగా మంజీరా, మృదంగం, హార్మోనియం, సితార్‌ మొదలైన వాటిని వాయిస్తూ పాడుతున్న భక్తులు - “మేరే తో గిరిధర్‌ గోపాల్‌...! మేరే తో గిరిధర్‌ గోపాల్‌

అంటూ ఆలపిస్తున్న కంఠాలు - చుట్టూ మరికొంత మంది భక్తుల జేజేలు -

జై బన్ఫూరివాలేకీ - నంద్‌కీ లాలేకీ - నమామి భక్తపత్సలమ్‌ - ప్రతిధ్వని స్తున్న సంధ్యా సమయం, గుగ్గిలం - అగరవత్తుల సుగంధం - మసక వెలు తురు ఎవరైనా చెప్పండి, నేనేం చెయ్యాలి?

స్తంభానికి ఆనుకొని బయటే మెట్లకై కూచున్నాను. నాలో పారిపోయే ధైర్యమన్నా లేదు. అప్పుడే పదిహేను రోజుల పాటు కలకత్తా - బొంబా యి, పూనా - హరిద్యార్‌కో - మరెక్కడికో పారిపోయి వుంటే ఇదంతా జరిగి వుండేదా? అప్పుడేమో అలా ఎడుస్తూ భయపడుతూ పుండిపోయాను - “నా కాళ్లకు విసు[రాళ్లు కట్టకండి? (సమానార్థకం - ముందు కాళ్లకు బంధాలు వేయకండి) - పిడికిట్లో నలిపేస్తున్న ఆకుపచ్చ గాజులున్న చేయి, పిండిము

సు పట్టుకొని మౌనంగా కూచుని, లోపలి నుంచి క్రపుంగా వస్తున్న రెండు

a rE

లుపులు వింటూ పుండిపోయాను... “ఇంకా సమయం వుంది. - పారిపో!-

6 ఆకాశం సాంతం

“ఓ భగవంతుడా, ఎవ్వరినో నా గొంతుకు కట్టేస్తున్నారు...! మసక మసగ్గా వున్న మంటల చుట్టూ తడబడే కాళ్లతో సప్తపదిని కొలిచిన తర్వాత... పురో హితుడు ఏవో మంత్రాలు చెబుతున్నాడు... జ్ఞాపకం వస్తున్నాయి - ఇదే విధంగా పురోహితుడు అని వుంటాడు - “జాగ్రత్త...” అప్పుడే బహుశా మాటని హెచ్చరికగా భావించి సమర్థ గురు రామదాసు మండపాన్ని వదిలేసి లేచి పారిపోయి వుంటాడు!

“ఇప్పుడిక కోడలు రావలసిందే ... పెద్దబ్బాయి పెల్లి జరిగి ఎనిమిది సంవత్సరాలు గడచిపోయాయి.” చుట్టాలు పక్కాలు అనేవాళ్లు ఇక అమ్మ రోజూ నచ్చ చెబుతుండేది, “చిన్న కోడలు ఇంటి గడపమై కాలు మోపే రోజు ఎప్పుడొస్తుందో! నాన్నగారు అందుకొనేవారు - 'ఈ మున్నీ పెల్లికి ఏడె నిమిది వేల అప్పు చేసాను. ఇక అబ్బాయిలే ఏమైనా ప్రయత్నిస్తే సాధ్యమ వుతుంది - నాకు చేతనయ్యే పని మాత్రం కాదు ..” తమ సుఖం, తమ స్వార్థం, తమ సంతోషం, ఇవే మా కుటుంబానికి కావాలి. ఎదుటివాడు చచ్చినా - మునిగినా వాళ్లకు పోయేదేముంది! ఇతరులకు కోరికలు వుండవు - (ప్రాణం వుండదు. పెద్ద వాళ్లు ముసలివాళ్ళు తమ కాలంనాటి ప్రపంచం ఏమీ మారకుండా సాగిపోవాలనుకుంటారు-' లేదో ఇక రసాతలానికి చేరిపోడమే! “ఏమిటండీ, కు[రాడికి కూడా స్వంత ఇష్టాలా? ఏమనుకుంటున్నారేమిల్‌? మేర ప్రపంచం చూసాము." కాని నిజం చెప్పాలంటే వీళ్లకు ముక్కుసూటిగా మరేమీ కనపడరు. పిల్లవాడికేం కావాలి పెల్లి జరిగితే చాలదూ? కోడలు రావాలి, పిల్లలు కావాలి, వాడేమో క్లర్కు ఉద్యోగానికి ఎదిగి తమ తర్వాత “'హుక్కా' గొట్టాన్ని పీల్చగలిగితే చాలు...! ఏం చెయ్యను? నా ఆశయాలు, ఎదో సాధించాలనే కలలు, అవన్నీ ఇప్పుడిక మట్టి కొట్టుక పోవలసిందేనా ఎన్నో రాత్రుళ్లు అలా మేల్కొని, నెత్తురు కార్చి పెంచు కున్న భవిష్యత్‌ ఇప్పుడిక నేలమట్టం కావలసిందే!

అసలు ఉదయం నేనేమి ఆలోచించానో, అది నేను కాదు మీరెవ్యరో ఆలోచించి వుంలారు. ఇప్పుడంతా నకిలీ అనిపిస్తున్నది. నేను డైరీలో ఇలా రాసుకొన్నాను. నేను ఇంత త్వరగా ఎందువల్ల ధైర్యాన్ని కోల్పోతాను? నా ఆశలనీ షఇఅణగారిపోయాయని ఇప్పుడే ఎందుకనుకోవాలి? బంగారం నిప్పులో తపించినపుడే కదా తావి అబ్బుతుంది - అందరి జీవితాల్లో పరీక్షా క్షణాలు

వస్తాయి ఇదినా అగ్ని పరీక్షా క్షణం. కష్టాల్లో ఇలా ఇంత త్యరగా గాబరాపడి

ఆకాశం సాంతం 7

పోవడం మంచి అలవాటు కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నేను నిల దొక్కు కోవాలి. గొప్పవాడు కావాలంటే ఇదే గీటురాయి - ఆపదలోనే మన స్పును (ప్రశాంతంగా వుంచాలి. నెపోలియన్‌ యుద్ధ మైదానంలోనే ఉత్త రాలు రాసేవాడు. నేను ఎదో గొప్పను సాధించాలనే విషయాన్ని. విస్మరించ కూడదు. ఏదో ఒకటి సాధించి గొప్పవాడినవుతే లోకం నా ముందు తలవం చుతుంది. ఒక్కమాట అనగానే ఆజ్ఞాపించినట్టు దేశమంతా వినేట్టు, విదేశీ మ్లేచ్చుల పిడికిటి నుంచి భారతమాతను విముక్తం చేయగలిగే గొంతుగా మారాలి. భారతదేశం మహా పురుషుల దేశం. నా ధమనుల్లో రాణా (ప్రతాప్‌, శివాజీ రక్తం [పవహిస్తున్నది, రక్తాన్ని సిగ్గుపడేలా చేయకూడదు. వారి వారసత్వాన్ని, సంస్కృతిని రక్షించే (పవాహాన్ని మనమే నడిపించాలి,సజీవంగా వుండాలి. మనం యువకులం. నాటికీ మనలోనే వున్న వేలాది భగవాన్‌ బుద్ధులు, మహా వీర్‌స్వామీ, భగవాన్‌ కృష్ణుడు, భగవాన్‌ రాముడు - వీళ్లంద రిని మనలోంచి మేల్కొల్పి ముందుకు తేవాలి. మన శక్తులే రోజు హను మాన్‌. భీముడు. భీష్మ పితామహాను పుట్టించగలవు. నా ఎదుట పరీక్షా కాలం - ఇది శాశ్వతం కాదు - అగాధాలను, అడ్డంకులను అధిగమించిన పుడే కదా - వాటికి మరో వైపు మహనీయత, గౌరవ సత్కారాల సౌరభాలు వున్నాయి, అమరత్వం పొందిన దేశం వుంది. “హర్టల్‌-రేస్‌' అక్కడికి చేరుకునే ముందు ఒక సవాలు. మన శక్తియుక్తుల్ని సానబెట్టాలనే భగవం తుడు అడ్డంకుల్ని కల్పించాడు. అడ్డంకులపై, కష్టాలపై కాలు మోపి పురోగమిస్తాం. జన్మ (బహ్మచారిగా వుండాలనే నా ప్రతినపై నాటికీ దృఢంగానే ఉన్నాను...

ఇదంతా నేను ఉదయాన్నే రాసుకొన్న డైరీ! కాని ఇప్పుడు ఏదో ఒక తీవమైన ప్రవాహం వేగవంతంగా తనతో లాక్కెల్లిపోతోంది. ఎక్కడ వదలి పెడుతుందో తెలియదు? వురి ఇప్పుడే వర్తమానాన్ని ఏం చేయాలి? - మధ్యలో వచ్చిన ఈ-మాయాజాలంలో - మోహినిలో నన్ను నేను బంధించు కోనా లేక పాదల్లోంచి తప్పించుకొని పారిపోవాలా? సాధ్య మైనంత వరకు ఇందులో నేను ఇరుక్కోను, ఇదే నా నిశ్చయం. ఓ, భగవంతుడా, పరీక్షా సమయంలో నా ఆత్మకు బలాన్ని ఇవ్వు. నేను లొంగిపోకుండా, వోడి పోకుండా నాకు దృఢత్వాన్ని (పసాదించు,

ఏమైతేనేం, వివాహం మాత్రం జరిగిపోయింది. కాని రోజు కూడా

8 ఆకాశం సాంతం

నేను మానసికంగా నేనే! నేను రంగుల వలలో, జంజాటంలో ఇరు కోను. బహుశా చాలా పెద్ద కార్యాన్ని తల పెట్టానేమో [ప్రాణప్రదంగా దీన్ని నిర్వహించాలి. నేను రూపొందే సమయమిది, నా నిర్మాణ కాలమిది,

(ప్రభ పదో తరగతి ప్యాసెందని ఎవరో అన్నారు. నేను ఆమె చేయిని తప్ప మరేమీ చూడనే లేదు. నా ముందు నడుస్తున్నప్పుడు ఆమె పాదాలు చూసాను - పారాణి పెట్టిన పాదాలు కాని ఏమైతేనేం ... వాటితో నాకేం సంబంధం! నేను ఆమెతో మాట్లాడను. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఎవో రెండు-మూడు మాటలు మాత్రమే - అంతే. ఇప్పుడైతే ఆమెను తల్లిగారిం టికి పంపించివేసే ప్రయత్నం చేస్తాను. అందరూ తమ స్వార్థాన్ని చూసు కుంటూ వుంటే నేను మాత్రం ఎందుకు చూసుకోకూడదు? ఎవరు (పలోభపె ట్టినా, ఎవరికీ లొంగను. వొత్తిడిచేస్తేనే కదా పెల్లి చేసుకొన్నాను. అదే చాలు - పది వేలు! మీకు ఏమి (ప్రయోజనం చేకూరిందో నా కనవసరం. నా కయ నిర్మాణాన్ని సాగించాలి. దీక్షతో - మనస్సుతో, [ప్రాణప్రదంగా చదు వుకోవాలి - మరో నాలుగేళ్లు - ఎమ్‌.ఎ. పూర్తి చేయగలుగుతాను. ఆమె అంతవరకు ఎం చేస్తుంది? ఎక్కడ వుంటుంది? నాకేం తెలుసు. ఆయినా తెలుసుకుని (ప్రయోజనమేమిటి? దారిగుండా వెళ్లడం లేదో, అక్కడి మైలు

రాళ్లు లెక్క పెట్టి ఎం లాభం? అడ్డంకులు ఇలా అప్పుడప్పుడు అందమైన రూవాన్ని ధరించి వస్తాయి. వాటి భపులో పడక పోవడమే బుద్దిమంతుల లక్షణం. భార్య తన ఇష్టానుసారం చేసుకునే - మేం పరస్పరం అడ్డంకుల్ని ఎందుకు సృష్టించుకోవాలి. ఎవరో అన్నారు, బాగా చదువుకున్నదని, అర్థం చేసుకోగలదని. నా దృక్పథాన్ని ఆవిడకు విడమర్చి చెప్పుకోవచ్చుగా? ఒకవేళ భవిష్యత్తులో గృహస్థ జీవితాన్ని గడపాలంటే కాలాన్ని మలచుకోవచ్చుగా! కనీసం నేను 'ఆఏడ ముఖమైనా చూడవలసింది. -ముఖం పైప మసకమసగగా స్పోట కపు గుర్తులున్నాయని వదిన చెప్పింది. ముక్కు మొగం ఎలా వుందో నాకేమీ తెలియదు, రోజు ఏమేమి చేయాలో ఏమిటో? ఎలా చేయాలో! సరే, ఏమైనా కానీ! వీలెతో నాకేం పని? నేను రోజు నిశ్చయించు తప్పదు - పరీక్షలో అన్నింటిని వుంచిన కఠినమైన సేపర్‌ రోజే! ఒక వేళ రోజు జారిపోయానో లోకంలో నన్ను శక్తి ఉద్ధరించలేదు |

ఇందులోంచ బయటపడానో ఒకేసారి తలనొప్పి సాంతం వదిలిసెడుతుంది.

My,

ఆకానం సాంతం 9

అసలు ఏమి మాట్లాడకుండా వుండాలంటే సాధ్యం కాకపోవచ్చు. ఆమెతో ఇలా అంటాను - చూడండి, తల్లితండ్రులు ఎలా వున్నా తవుకు తోచిన దేమో చేసారు. అయితే మన వెనకా ముందేమిలో మనమే చూసుకోవాలి. అన్నింటికంటే మొదలు మన చదువు పూర్తి చేసుకోవాలి... ఇదంతా విన్నాక, ఆవిడ ఏడ్పు (ప్రారంభిస్తే - ఆమె ఉప్పు కన్నీళ్లు నా దృఢత్వప్పు నేలను కరి గించివేస్తే...? లేదు, లేదు, లేదు... బుద్ధ భగవాన్‌ను యశోధర సౌందర్యం బంధించగలిగిందా, గోపికల యేమ కృష్ణ పరమాత్మను యోగిపుంగవుడిగా మారకుండా ఆపెందా!

అదిసరే, ఏమిటండీ, భార్య ఎప్పటికీ అడ్డంకిగానే వుంటుందా? రాముడి శక్తిని సీత నుంచి వేరు చేయగలమా? రాజస్థానీ క్షా (త్రాణీలు స్వయంగా తమ పతి దేవుళ్లను యుద్ధానికి పంపించలేదా? కాని నేను... నేను మాత్రం చాలా బలహీనుణ్జి. నన్ను నేను రూపంలో మలచుకుంటే తప్ప ఇది అసాధ్యమ వుతుంది. అప్పటిదాకా నిర్లక్ష్యమే నా ఆయుధం, ఉదాసీనత నా ఢాలు... కన్నీళ్ల - వాసనామయమైన ఊబిలో ఎంతో జ్మాగత్తగా పాదాలు మోపుతూ నడవాలి భగవత్‌ విగ్రహమే ఇక సాక్షి!

ఓ, భగవంతుడా, నాకు శక్తినివ్వు, నిగ్రహాన్ని ఇవ్వు, సుబుద్ధినివ్వు. నన్ను సరైన మార్గంలో నడుచుకోనివ్వు. నాతోడుగా వున్న వారే వుంటారు నా వెనకాలే ఆగిపోయిన వాళ్ల వ్యామోహంలో నేను ఆగిపోనుగాక - నేను నాలో నేన్తు శక్తి మాకివ్వు దయానిధే, కర్తవ్య మార్గంలో సాగిపోతాం...”

అప్పుడే ఉలిక్కిపడి చూసాను, భజన ముగిసి కీర్తన మొదలైంది.

రెండు

నవ్వులు, కేరింతలు, కిలకిలారావాలు - హాస్యాలు, వాయిద్యాలను ఎదు రెదురుగా ముఖాల ముందు పెట్టి ఊదేస్తున్న షహనాయి వాయిద్యకారులు - కాని నాకేమో ఏదో తుఫాస్‌ను గుంబద్‌ లాంటి గోళాకార నిర్మాణంలో బంధిం చగానే, అది అలా చుట్టూ తిరిగేస్తూ, ఇటు నుంచి అటు బుసలు కొడుతూ తిరుగుతున్నట్టు, బయటికి వెళ్ళే దారి ధొరకసట్టు...

అసలు ఇంతకు, మంచి జరిగిందో చెడు జరిగిందో - నాకు తెలియదు.

10 ఆకాశం సాంతం

శోభనపు రాత్రి వచ్చింది, పోయింది. నేను నిజంగానే ఆమెతో మాట్లాడలేదు. ఇదంతా భగవంతుడు నా ప్రార్థనలను ఆమోదించి చేసిన మేలు అనుకో వాలా లేదా దురదృష్టానికి ప్రారంభమనుకోవాలా ఏమీ తేల్చుకోలేక పోతు న్నాను. నేను ఎంతో భావుకుణ్ణి, ఎంతో బలహీనుణ్జి. ఆవేశాల్లో, బలహీనతల ఉప్పెనలో నేను అతి త్వరగా తప్పిపోతాను - అప్పుడు నాకెలాంటి దరి దొరకదు.

వదిన వెనకాల నుంచి మెల్లగా నెట్టి, తలుపు మూసివేసేసరికి నేను గదిలోకి వచ్చేసాను. అప్పుడు (ప్రభ, కిటికీకి తల ఆనించి నిలుచుని వుంది. అలా నిలుచుని నిద పోతున్నల్లే వుంది. కాసేపు అలానే నిలుచుని, తర్వాత మెల్లగా వెళ్ళి మంచం చివర ఏదో భయపడుతున్న వాడిలా నిలుచున్నాను. చడిచప్పుడు కాకుండా అలా వెళ్ళి మంచం పడుకోవాలనుకున్నాను... అసలు ఎపుడు నిద్రపోయానో తెల్లవారిగాని మెలుకువ రాలేదు. అపుడు నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, నాలోని శక్తివంతమైన కొండలు డైనమైల్‌ పేల్చివేతకు సిద్ధంగా వున్నట్లు అనిపించింది. నా ఆత్మ విశ్వాసాన్ని, దృఢ త్వాన్ని మరింతగా పుంజు కోవాలని ప్రయత్నించాను. నా మిత్రులు కుర్రాళ్ళు ఏవేవో చెప్పాలని ఉబలాట పడ్డారు - మూర్జులు! వాళ్ళంతా సన్ను వేలల్లో, లక్షల్లో వుండే ఒక మామూలు వ్య క్తిలా భావిస్తున్నారు. వ్యక్తులకు స్తీ లేదా అలా నడిచి వెళ్ళే ఏదో అమ్మాయి ఐదో స్వర్గంలోంచి ఊడిపడిన పువ్వులా కనపడి, అమ్మాయి కోసం యుగాలుగా వాళ్ళ ఆత్మలు తపిం చినట్టు ప్రవర్తిస్తారు. గుర్రపుబండిలో వెళ్ళే అమ్మాయిలను ఎదో... చూసి “దర్శన సుఖం” పొందాలనే తాము వెడుతున్న దారి వదలి మైళ్ళ కొద్ది వెన కాలే వెళ్ళిపోతారు. నేను వాళ్ళలాంటి వాణ్ణి కాను, నా దారి వాళ్ళదారికాదు.

మనస్సులో ఎన్నోసార్లు... స్తీ చీకటి, స్త్రీ వ్యామోహం, స్తం ఒక మాయ. దైవత్వం. వైపు వెడుతున్న మనిషిని స్త్రీ బంధించి రాక్షసత్వమనే చీకటి అగాధాల్లోకి విసిరేస్తుంది. స్తీ) పురుషుడికి అన్నింటిని మించిన బలహీనత.

నా దారి వేలు - లక్షల కుర్రాళ్లు వెళ్లే దారి కాదు. పెకి నేను ఎలా కన పడినా, నేను వాళ్ల కంటే అన్ని రకాలుగా భిన్నమైన వాడిని. నా భవిష్యత్తు నా చేతులలో వుంది. నేను ప్రతిక్షణం కత్తి అంచునై నడుస్తున్న వాణ్ణి. నేను ఇంకొంచెం స్టిరపడాలి. ఊగిసలాడకూడదు. నేను వేళ వాళ్ళందర్ని

మించి ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగిపోయినట్టుగా భావిస్తున్నాను.

ఆకాశం సాంతం 11

(పతి పెళ్ళిలో జరిగినల్టే, ప్రభ సిగ్గుపడుతూ కొత్త పెళ్ళి కూతురులా ముడుచుకుపోయి, అదే అలంకరణలో నాకు స్వాగతం చెప్పడానికి సిద్ధంగా వుంటుందని నేను గదిలోకి వచ్చేముందు అనుకున్నాను. అసలు అదే క్షణాన ఎంతో జాగ్రత్తగా నిలదొక్కుకోవాలి. కాని అపుడు ఆమెను చూసి బిత్త రపోయాను... వివాహాల్లో ధరించే రంగురంగుల దుస్తులే వేసుకుంది ఆమె, కాని నేను మంచంపై కూచున్న తర్వాత కూడా కిటికీ దగ్గర నుంచి ఆమె కదలనే లేదు. నన్ను లోనికి పంపించే ముందు, వదినతో పాటు పొరుగింటి ఆడవాళ్లు, బంధువులు ఇంకెవరో తమలో తాము గుసగుసలాడుతూ ఏవేవో మాట్లాడుతూ, నవ్వుతూండి పోయారు. నేను ఏమి విన్లేదు. వేళ గది లోని నిశ్శబ్దాని చీలుస్తూ స్టూలుమై వున్న ఫ్యాన్‌ చప్పుడు (పతిధ్వనిస్తు న్నది. ఫ్యాన్‌ రెక్క తీగకు తగిలినపుడల్లా కిరుమని ధ్వనించేది. వివాహం కోసమే పారుగింటిలోంచి కరెంటుని అరువుగా తెచ్చుకున్నాం. నేను ఎంతో నిర్లక్ష్యంగా ఏవి పట్టనట్టు వుండిపోయాను. నా భావాలు నిర్మలత్వం వల్ల, జాన్నత్యం వల్ల నా ముఖం జ్యోతిర్వలయంతో ధగ ధగ మెరుస్తున్నట్టు ఊహిం చుకున్నాను. ఆమె నిజంగానే నిద్రపోయిందేమోనని కాసేపు ఆగి అటు చూసాను. కాని ఆమె మాతం నేను పుంచంకపపె కూచోగానే అలా కాస్త తలపైకెత్తి చూసి, తర్వాత ఏమీ జరగనట్టు అటువైపే తన తలను ఆనించిపెట్టుకుంది.

నేను దద్దమ్మలా అలా కూచుని ఫ్యాన్‌ను చూస్తుండిపోయాను. ఇపుడు ఏం చేయాలి? మెల్లిగా మంచండై అడ్డంగా పడుకున్నాను. తలను గోడకు ఆనించి పైకి లేపాను. క్షణాలు దొర్లిపోతున్నాయ్‌. నా కాఠిన్యం మూలంగా ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తుందని నాకు అనుమానం కలిగింది... రెండు చేతులో నా పాదాలను పట్టుకుని అభయం ఇమ్మన్నట్టుగా కన్నీట తడిసిన మొఖంతో అలా వేడుకుంటుంది అని అనుకున్నాను. “నా స్వామీ! చెప్పండి, దాసి వల్ల అపరాధం జరిగింది.” అప్పుడిక పాదాలపై తలబాదుకుంటు వేల సార్లు మన్నించమని కోరు కుంటుంది. క్షణం బహుశా నాకు నిభాయించు కోవడం కష్టమే అవుతుంది. అలా క్షణక్షణం గడిచిపోతుంది. నాటకమేగా సాగిపోయేది...

కాని అప్పటికే చాలా ఆలస్యమై పోయిందనిపించింది, అర్థర్మాతి

స్తబత ఆప్పుడప్పుడు కొన్ని గాజుల గలగలలతో పాలు మా పధ్య ఎషపూ రితమైన పొగలా. వ్యాపిస్తూనే వుంది. అప్పుడు నాకు హఠాత్తుగా అనిపిం

12 ఆకానం సాంతం

చింది - అనుమానాల. భాపుకత సాగరంలోని స్పాంజిలా ఉబ్బుతూ అణిగి పోతూ నా గుండె ఇపుడు గడ్డ కట్టిపోయి ఒక రాయిలా మారిపోయింది. ఎవరో నా లోపలి నుండి అడిగారు “నే నిక్కడికి ఎందుకొచ్చాను! మాటలు లేవు. స్వాగతం లేదు - ఇది నన్ను అవమానించడం కాదా?” ఏదో సాధించాలనే ఆకాంక్ష, ఎన్నో ఆశలు, నిస్త్రాణమైన దృఢత్యపు మంచు దుప్పటి కింద వేడి సరస్సు గలగలలసు నేను అనుభవిస్తున్నానని అంగీకరిస్తున్నాను. క్కడో మనస్సు చీకటి కొనలో బహుశా విషయం గురించి ఎంతో వుంది. బహుశా కుతూహలం, తెలుసుకోవాలనే తపన... బహుశా ఎదో తీయదనం. నాలో ఉపరితలపు దృఢత్యంతో పాటు జక భయం కూడా వుంది. నాలోన వహిస్తున్న వెచ్చటి నెత్తుటి పవహం ఒక (ప్రచండమైన గ్లేషియర్‌లాగా ఏరుచుకు పడుతుందేమోనని, నేనందులో కొట్టుకుపోతానే మోనని భయంగావుంది. ధసస్సులోంచి దూసుకొచ్చిన బాణం తన లక్ష్యాన్ని చేధించినట్టు నా లోపల ఏదో వస్తువు విలవిలలాడి కొట్టుకున్నట్టు నాకు అనిపించింది - అవమానం! ఇది నాకు అవమానం. లోపల ప్రపహిస్తున్న నెత్తుటి ధార మరుక్షణంలోనే గడ్డకట్టి మంచుగా మారిపోయింది. నేసు అసలు ఇక్కడి కెందుకొచ్చాను? రోజు నేను ఇంకెక్కడికి వెళ్ళలేక - పచ్చేసాను. మహా అయితే ఏమయ్యేది ఇంట్లోని వాళ్ళంతా కాసేపు హైరానా పడేవారేమో! మా ఇంట్‌ వాళ్ళంతా చదువురాని వాళ్ళు, ఇక ఈమె మక్‌ దాకా చదిఏంది. బహుశా అదే అహంకార మేమో? నిజంగానే ఆపడ తస గురించి గొప్పగా భావించు కుంటున్నది. ఆమె అలానే నిలుచుని పుంది. నేనేమో కోపంగా లేచి కూర్చు న్నాను. సిగ్గులేనిది! ఇదేనా ఈనాటి చడుపు ? ఎవ్వర్ని లక్ష్య పెట్టక పోవడం. సిగ్గనేది లేకపోవడం. మిగతా కురాళ్ళలాగా నేనామెకు నచ్చజెప్పి, వేడు కుంటానని అనుకుంటున్నట్టు వుంది? సరే చూద్దాం. ఇదెప్పుడైనా లెక్కలోకి వచ్చేదే. ఇక అవకాశం ప్రళయం వచ్చేవరకు రాదేమో. మొదల్లో నేను ఫరవాలేదు మేము చదువుకున్న వాళ్ళం, బుద్ధిమంతులం అనుకున్నాను. పరస్పరం మాట్లాడుకుని, ఒకరికి ఒకరం మరింత యోగ్యులుగా మార్చుకోవా లనే ఆశ. కాని అది కాని పని. ఆమెకి ఇదే ఇష్టమైతే అలాగే కానిద్దాం. అసలు నేను లొంగిపోను, రోజు లొంగిపోయానో జీవితం సాంతం మతిలేని వాడి

కిందే జము. రోజైతే దీది అంకేమిటో నేనే తేల్చుకోవా లి. అలా నిల్చొని

రి "ల

ఆమె ఒజహుశా నేనే ముందుకు వచ ఇలా అడుగుతానని ఆసుకుంటున్న

ఆకాశం సాంతం 13

దేమో: “నడవండి, ఎందుకు నిలుచున్నారు. కూచొండి.” అప్పుడిక ఆమె సిగ్గుపడి, నయగారాలు పోయి ఎదో అలిగినట్టు నటిస్తుంది. అప్పుడే మొదటి సారి నాకు ఆవిడకు కనీసం మర్యాద లేదని అనిపించింది. నేను లోపలికి రాగానే కనీసం నవమస్కారమైనా చేయలేదు. అసలు నా పాదాలపై ఆవిడ వంగిపోగానే నేను ఆవిడ రెండు భుజాల్ని పట్టుకుని పైకి లేపాలని అనుకున్నాను. ఆమె ఇంటివాళ్ళు నేర్పించిన సభ్యత మర్యాద ఇదేనా? పెళ్ళి చూపుల పుడు వాళ్ళు మహా గర్వంగా చెప్పారు. మా అమ్మాయి మెటిక్‌ దాకా చది వందని!

అలా కొన్ని క్షణాలు కూచొని, కూచొని గడచిన తర్వాత ఒక ఉదుటున లేచినిలుచున్నాను. తలంతా గిర్రున తిరిగిపోతున్నది. గది అంతా అవమా నాల సంకేతాలతో నన్ను చూసి అట్టహాసంగా నవ్వుతున్నది. అప్పటికి ఎక్కడో ఒక మూల నాలో ఒక ఆశ - నేను వెళ్ళిపోతుంటే ఆమె నా వెనకాలే వచ్చి నా చేయి పట్టుకుని, లేదా షర్టు చివర పట్టుకుని ఆపుతుందని... అప్పుడిక కాస్పేపు ఆగి, ఆమెను క్షమించే విషయం గురించి ఆలోచిస్తానేమో! కాని నేనెపుడైతే నిలుచుని రెండు మూడు అడుగులు తలుపు వైపు వేయగానే ఆమెలో అలాంటి భావమేది కనబడలేదు. అప్పుడిక నా స్వాభిమానం పెలోలు జ్వాలలా (ప్రజ్యరిల్లిపోయింది. అప్పుడే నేను నిశ్చయించుకున్నాను - ఆమె ఒక వేళ నన్ను ఆపినా నేను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాను. బుద్ధిలేనిది!

దడాలున నేను తలుపు తెరపగానే ఆమె వులిక్కిపడి తలమకైకెత్తినట్టు అనిపించింది. అప్పటికే నేను బయటికి వచ్చేసాను. ఎందుకో నేను ఒక క్షణం బయలే ఆగిపోయాను. తర్వాత మెట్లు ఎక్కి మిద్దెకపై భాగానికి వచ్చేసాను. అక్కడ అందరూ మంచాలపై లేదా కింద పడుకుని వున్నారు. వెన్నెల కురుస్తున్నది. రాతి రాణి చందుడు గొడుగు పట్టుకుని నిహారికల మార్గంలో నడిచిపోతున్నది. నేను ఎమీ చూడకుండా, ఒక మూల నేలపె పడిపోయి నాతో నేను యుద్ధం చేస్తూ వుండిపోయాను.

వుఫ్‌, వ్యవహారాన్ని నేను జీవితాంతం మరిచిపోగలనా? లేదు లేదు. విద్యోత్తమ వ్యవహరించిన తీరు వల్లె ఒక వజ మూర్జుడు కవితా రాజకుమారుడగా - కాళిదాసుగా మారిపోయాడు. ఇప్పుడిక అవమానా నికి నేను రూపంలో ప్రతీకారం తీర్చుకుంటానో ఇక చూడాలి. కాని ...

14 ఆకాశం సాంతం అసలు నేసక్కడికి ఎందుకు వెళ్ళాలి? నాలో అది ఒక బలహీనత కాదా? పథ(బ్రష్టుడనైనందుకు దేవుడిలా శిక్షిస్తున్నాడేమో? నన్ను సంభాలించే ఎదురు దెబ్బనేమో ఇది. ఎక్కడో చదివాను “మనిషిలోని నిజమైన ఆత్మను బయ టికి లాగాలంటే' ప్రపంచంలో అవమానాన్ని మించిన శక్తి మరొటి లేదు”' నా ఆత్మలో ఎంత శక్తి దాగి వుందో నేను చూసుకోవాలిక! జ్ఞాపకం వుంటుంది. ఇది శోభనపు నాటి కానుక. జరిగిపోయిందేమిటో, ఒకందుకు మంచికే జరి. గింది. ఆసలు దారి నాదైతే కదా! నా అదృష్టం వెటుతున్న దిశను స్పష్టంగా చూడగలుగుతున్నాను. అటూ-ఇటూ వెళ్లే దారులన్ని మూసివేస్తూ ఒక నిశ్చితమైన మార్గాన్ని తెరుస్తు న్నది. నిశ్చయంగా మార్గం బెన్నత్యానికి మార్గం, మానవత మార్గం. మానసికాందోళనలోనే నా కళ్లు చెమర్చి అనాయాసంగానే కన్నీ ళ్లతో నిండిపోయాయి. ఎంత ప్రయత్నించినా నన్ను నేను సంభాలించుకో లేక పోయాను. రెప్పవాల్చకుండా కళ్లు ఆకాశాన్ని చూస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చేస్తున్నాయి. భగవంతుడా! నా మెడలో ఏమిటిది కట్టేసావు! ఎక్కడికి తీసుకొచ్చి పడేసావు! క్షణంలో అదే భావం - మాటి మాటికి నా మనస్సు లోంచి ఉప్పెనలా కంటకావృతమైన మార్గంలో నేసు ఏకాకిని - మరీ ఒక్కచ్ణ్చే! ఎవ్వరూ వెంటలేరు. నా అలసటను, చెమటను తుడ్చిః తనను వోదార్చు మాటలతో చుట్టేసే వాళ్లు ఎవ్వరూ లేరు. నా నైరాశ్యపు కన్నీళ్లు తుడిచి ఇలా అనగలిగే వాళ్లు లేరు - “నడూ, నేను నీతోనే వున్నాను. ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నాకో గుదిబండలా తగిలించారు. జీవితం ఇక ఎలా సాగనుందో...? మళ్ళీ అనిపించింది - ఏదో ఒక అజ్ఞాతశక్తి నా గరీ రంలోని అణువణువు నుంచి నీళ్లు పిండేస్తూ కళ్ళ దారి గుండా పారబోస్తున్నదని... అప్పుడే లేచి, ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోతే ఎలా వుంటుం దని నా మనస్సు అగాధాల్లో ఆలోచిస్తు వుండి పోయాను. ఎక్కడికైనా వెళ్ళిపోతాసు - కలకత్తా, బొంబాయి లేదా హరిద్వార్‌ పారిపో... పారిపో... పొగ, నిప్పులు - ఆవిరి కుంపటిపపై నేను రాత్రంతా వేగిపోతూ, ఉడికి పోతూ వుండిపోయాను.

ఆకాశం సాంతం క్‌5్‌

మూడు

అరణ్యంలో రగులుకున్న భయంకరమైన అగ్నిలా సమర్‌, (ప్రభతో మాట్లాడనే లేదు అనే విషయం ఇల్లంతా వ్యాపించి పోయింది.

రెండు చేతులతో తల పట్టుకుని మోచేతులను మోకాళ్ళపై ఆనించు కుని నేను నా గది గడపమై అలానే కూచుని చాలా సేపట్నుంచి ఎమిలేమిటో ఆలోచిస్తు వుండిపోయాను. ఇప్పుడిప్పుడే అంత్యక్రియలు జరిపి వచ్చినట్లు మనస్సంతా ఉదాసీనత వ్యాపించింది. సాయంకాలపు నీడలు మూలల్లోకి సందుల్లోకి అప్పుడప్పుడే చొచ్చుకపోతున్నాయి. ఎదురుగా ఒక మహాశూ న్యంతో నిండిన ఒక గుడ్డి సముదం పరవళ్ళు తొక్కుతున్నట్లు అనిపించింది - ఇప్పుడు నేను ఏం చేయాలి?

ఉదయం నుంచి ఎంతో మంది అడిగారు. బహుశా (ప్రభను కూడా అడి గారేమో - కాని ఇద్దరు కూడా అయిష్టంగా ఏమీ చెప్పక పోయేసరికి మళ్ళి ఎపరు కూడా అడగాలని సాహసించలేదు. మొదట వదిన వ్యంగ్యంగానే (ప్రశ్నించింది. తర్వాత కొంచెం గంభీరంగానే తెలుసుకోవాలనుకున్నది. అమ్మ కూడా అడిగింది. కాని నేను అందరిని తప్పించుకున్నాను. దినమంతా మొఖం చాటు చేసుకుంటూ ఇటు అటు తిరుగుతూ వుండిపోయాను. నేనునా భార్య అనబడే ఆవిడ పట్ల కోపంగానే వున్నాను. కాని ఆమె నాకు విరుద్ధంగా ఏవేవి చెప్పిందో వనాలని కూడా అనిపించింది. ఇంతవరకైతే విషయం ఎదీ ఏనలేదు. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆమె ఇంటివాళ్ళు కూడా ఆమె నుంచి ఎమీ లాగలేక పోయారనే అనుకున్నాను. వాళ్ళు ఎమి కోరుకున్నా అది నా పప్రపర్తన గురించే! ఇదంతా నన్ను మంచి చేసుకోడానికి జరుగుతున్నదేమోనని ఉలిక్కిపడేవాణ్ణ్టి. కాని నాలో ఇప్పుడు ఒక తటస్థమైన నిర్ణిప్త్రభావం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవ్వరూ నాకిపుడు ఏమీ కారు! ఆమె ఒకవేళ అందరికి ఎవైనా చెప్పివున్నా అప్పుడుకూడా బహుశా నాకు అదేమి కొత్తగా వుండేది కాదేమో.

నాన్నగారు ఏదో నిగూఢ రహస్యాన్ని తెలుసుకోవాలనే ధోరణిలో అడి

గ్య

గారు. (ప్రత్యేకించి ఏవైనా జరిగిపోయిందా? నేను ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ

ల్ని

ఆయనే అడిగారు. ఎవైనా మాటాషూటా అనుకుని తగాదా పడలేదు కదా?

16 ఆకాశం సాంతం

మున్నీ వచ్చి “నాన్నగారు పిలుస్తున్నారు అనే సరికి నా ధైర్యం ఊగిస లాడింది. నాన్నగారెందుకు పిలిచారు? కాళ్ళీడ్చుకుంటు అక్కడికి వెళ్ళాను. నాన్నగారి ఎదుటి పడాలంటె నేనెప్పుడు భయపడుతుండేవాణ్ణి. ఇటీవల మూడ్నాలుగు సంవత్సారాల నుంచి నాపై చేయి చేసుకోకపోయినా గతంలో శరీరంథె పడిన దెబ్బల గుర్తులు: ఇప్పటికి జ్ఞాపకమొస్తాయి. జ్ఞాపకాలే ఆయనంటే కలిగేభయాన్ని నాలుగింతలు పెంచేసింది. ఆయన ఎప్పుడు ఏం చేసేస్తారో ఏం చెప్పలేం! నన్ను ఆయన కొడుతుండే రోజుల్లో నేను మొండికేసే వాణ్ణి - మహా అయితే కొడతారు అంతకంటే ఏం చేయగలరని! హాకీ, ఫృట్‌బాల్‌ ఆడినప్పుడు తగిలే దెబ్బలను సహించమా. కాని ఆయన వ్యవహరించే తీరు నాలో రహస్యమయమైన భయాన్ని సృష్టించింది. నేనే దెనా తప్పు చేసినపుడు ఆయన చీవాట్లు పెడతారనే అనుమానం కలిగినా కొడతారనుకున్నా అవేవి జరగకపోయే సరికి నా ఖాతాలో ఎంతో దండన జమ కిందికి వచ్చేసిందని అనుకునే వాణ్ణి. ఫలితంగా ఆయన్ని తప్పించుకో వడం, భయపడటం నా స్వభావంగా మారిపోయింది. నాలో నేను ఎంత వ్యతిరేకించినా, తిరగబడినా, ఆయస ససుక్షంలో నోరు మెదపలేనంత భయం నా నరనరాన పాకిపోయింది. అందువల్ల ఆయనేమి చెప్పినా లోలోపల గొణు క్కుంటూనే నేను చేస్తూవుండేవాణ్ణి.

ఎంతో భయపడుతూనే ఆయన అడిగిన వాటికి జవాబుగా ఒక ఉపన్యా సాన్ని తయారు చేసుకున్నాను. ఆయన అలా నిశ్శబ్దంగా హుక్కా తాగుతూ ఎంతో గంభీరంగా తాత్వికుడి ముదలో కూచుని పెదాల్ని వంకర టింకరగా తిప్పుతూ పొగ వదులుతున్నారు. పక్కనె వున్న ఖాళి కుర్చీల వైపు చూసి బహుశా ఇప్పుడిప్పుడే కొంత వుంది ఇక్కడ కూచుని వెళ్ళి వుంటారని అనుకున్నాను. ఆయన నన్ను కూర్చోమని కనురెప్పలతో సైగ చేయగానే నా సాహసమంతా పాగలా ఎగిరిపోయింది. ఏదో విధంగా కుర్చి అంచున కూర్చున్నాను.

ఏమిటి సంగతి, కోడలు నీకు నచ్చలేదా? ఎంతో మృదువుగా ఆయన అడిగారు. ఆయన మాటల మృదుత్వాన్ని చూపి నేను ఉలిక్కిపడి భయపడి పోయాను. నా ఉపన్యాసంలోని ఒక్కొక్కపదం రాలిపోసాగాయి.

నేనేమీ మాట్లాడక పోయేసరికి ఆయస హుక్కాలో ఒక పెద్ద దమ్ము లాగి, పొగను మెల్లిగా వదిలితూ అడిగారు “స్పష్టంగా చెప్పేయ్‌, ఇందులో

ఆకాశం సాంతం 17

సంకోచించవలసిన పని ఎమిటి? నువ్వసలు ఆమెతో మాట్లాడనే లేదని విన్నాను?” |

నేను నిశ్శబ్దంగా నా అరచేతుల్ని చాచుకుని చేతిరేఖల్నోచూస్తూ వుండి పోయాను. అనుకున్న (పశ్నలు జవాబులన్నీ మెదడ్లోంచి జారిపోయాయి. మనస్సులో ఒక ఆర్డంమైన ఉచ్చ్వాసం చుట్టుకుంది.

నాన్నగారు హూంకరిస్తు ఇలా అన్నారు పాపం పరాయి అమ్మాయి, ఎవరి ఆసరా చూసుకుని వచ్చిందో ఆలోచించావా? ఇంటికి కోడలిగా వచ్చిన ఆవిడతో ఇలాగేనా ప్రవర్తించేది? తల్లిగారింటికి వెళ్ళి ఏం చెప్పు కుంటుంది? నీకు పెళ్ళంటే ఇష్టం లేదని తెలుసనుకో, కాని అబ్బాయ్‌, ఇదంతా లోకంలో జరిగేదే! ఇక ఏం జరిగిందో దానినైతే నిభాయించుకోవాలి కదా సరే అనుకో...

అకస్మాత్తుగా నేను వెక్కి వెక్కి ఎడుస్తూ వుండే సరికి ఆయన మాట మధ్యలోనే ఆగిపోయింది. నిజం చెప్పాలంటే అలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. కాని నాన్నగారి మాటలు వినగానే ఎందుకనో నన్ను నేను ఆపుకోలేక పోయాను. చిన్న పిల్లాడిలా నన్ను నేను సంభాలించు కుంటూ, పిడికిళ్ళతో కళ్ళను ముక్కును రాసుకుంటూ వుండిపోయాను. అప్పు డాయన నచ్చజెపుతూ ఇలా అన్నారు. “వెళ్ళు, ఏవిటా మరీ *పిల్లాడిలా” అప్పుడు నేను మారు మాటాడకుండా లేచి పచ్చేసాను.

uh

నేను నా

విలో ఆలోచిస్తూ వుండిపోయాను. తల తోకా లే హారంలో నా తప్పనేది నాకేదీ కనపడలేదు. పెలి రాలకు, ఆకాంక్షలకు ఎషం లాంటిది. అమ్మాయి చదువుకున్నదని, తెలి వెనదని తెలిసి ఏదో అనుకున్నాను. మేం పరస్పరం అర్థం చేసుకునే (ప్